News October 11, 2024

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

image

TG: ఆరోగ్యశాఖలో మరో 371 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా గత నెలలో 2,050 స్టాఫ్ నర్స్ పోస్టులకు ప్రకటన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నర్సింగ్ పోస్టులకు అక్టోబర్ 14, ఫార్మాసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. <>సైట్<<>>: https://mhsrb.telangana.gov.in/

Similar News

News September 18, 2025

‘మార్కో’ సీక్వెల్‌‌‌కు ఉన్ని ముకుందన్ దూరం!

image

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

News September 18, 2025

చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

image

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.

News September 18, 2025

APPLY NOW: ఇస్రో‌లో ఉద్యోగాలు

image

<>ఇస్రో<<>>లో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్. ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌ 7 అసిస్టెంట్(రాజ్యభాష) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.