News October 11, 2024
అప్పుడే బంధాలు మెరుగుపడతాయి.. కెనడాకు తేల్చిచెప్పిన భారత్

భారత వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన, ధ్రువీకరించదగిన చర్యలు తీసుకున్నప్పుడే కెనడాతో బంధాలు మెరుగుపడతాయని భారత్ స్పష్టం చేసింది. భారత్-ఆసియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా PM మోదీని కలిసి వాస్తవిక సమస్యలపై చర్చించినట్టు కెనడా PM ట్రూడో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి అర్థవంతమైన చర్చలు జరగలేదని పేర్కొనడం గమనార్హం.
Similar News
News July 10, 2025
ఇంగ్లండ్ నాలుగు వికెట్లు డౌన్

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్‌ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బౌల్డ్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రూట్(62*), కెప్టెన్ స్టోక్స్(0*) ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 172/4గా ఉంది.
News July 10, 2025
PHOTOS: ‘బాహుబలి’ టీమ్ రీయూనియన్

ఇండియన్ మూవీని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన ‘బాహుబలి’ మూవీ విడుదలై ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా రీయూనియన్ అయ్యారు. డైరెక్టర్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ తదితరులు ఒక్కచోట చేరి తమ జర్నీని గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
News July 10, 2025
విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

AP: లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.