News October 11, 2024

తెలంగాణకు వచ్చేస్తున్న అకున్ సభర్వాల్

image

TG: సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన ఐటీబీపీ ఐజీగా పని చేస్తున్నారు. కాగా 2017లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసును అకున్ సభర్వాల్ పర్యవేక్షించారు. కేసు కీలక దశలో ఉన్నప్పుడు ఆయన కేంద్రానికి వెళ్లిపోవడంతో డ్రగ్స్ కేసు మరుగునపడింది. మళ్లీ ఇప్పుడు ఆయనకు ఏ పోస్ట్ ఇస్తారోనని చర్చ జరుగుతోంది.

Similar News

News February 13, 2026

ప్రేమ వెన్నెల.. జేబుకు చిల్లురా!

image

ఒకప్పుడు ప్రేమికుల దినోత్సవం అంటే విష్ చేయడం, కలవడం, కుదిరితే గిఫ్ట్ లాంటివి ఉండేవి. ఇప్పుడు సినిమాలు, సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో ఇవి తప్పనిసరి అన్నట్లు మారాయి. దీంతో బేకరీలు, రెస్టారెంట్స్, ఫ్లోరిస్ట్స్ మొదలు ప్రతి బిజినెస్ వాలంటైన్స్ థీమ్‌తో రెడీ అవుతోంది. ఫలితంగా ఓ గులాబీని ముట్టుకున్నా రేటు ముల్లులా గుచ్చుకుంటోంది. ఇంకేముంది.. థ్రిల్ కోసం చేసే బిల్‌తో సగటు ప్రేమికుడి జేబుకు చిల్లు తప్పడం లేదు.

News February 13, 2026

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

బనారస్ హిందూ యూనివర్సిటీలో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ (సోషల్ సైన్స్), NET, M.Phil/PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000, రీసెర్చ్ అసిస్టెంట్‌కు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.bhu.ac.in/

News February 13, 2026

నల్గొండ కార్పొరేషన్ ‘హస్త’గతం

image

TG: నల్గొండ కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 48 డివిజన్లకు గానూ 27 స్థానాలను కైవసం చేసుకొని హస్తం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. BRS 9, BJP 3, AIFB 4, ఇండిపెండెంట్లు 4, ఎంఐఎం-1 చోట విజయం సాధించాయి. కాంగ్రెస్ విజయం సాధించడంతో జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నాయి.