News October 11, 2024
HYD: బంగారు మైసమ్మ సన్నిధిలో CP సీవీ ఆనంద్

దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పార్శీగుట్ట, మధురానగర్ కాలనీ బంగారు మైసమ్మను హైదరాబాద్ CP సీవీ ఆనంద్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీపీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి ప్రసాదం అందచేశారు. సీపీ నగర ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 4, 2025
JNTUHలో ఏంటీ పరిస్థితి.. MTechకు తగ్గిన ఆదరణ

MTech కోర్సులకు ఎందుకో రోజురోజుకూ ఆదరణ తగ్గుతోంది. ఆ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. JNTUHలో నిర్వహించిన ఎంటెక్ స్పాట్ అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. JNTUHలో 35 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. అయితే కేవలం 14 మంది మాత్రమే MTech అడ్మిషన్ తీసుకున్నారు. అంటే 21 సీట్లు మిగిలిపోయాయన్నమాట. అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది.
News November 4, 2025
FLASH: తాండూరులో RTC బస్సుకు యాక్సిడెంట్

తాండూరు(M)కరణ్‌కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూర్ వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా.. మరొకరు గాయపడ్డారు. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
News November 4, 2025
జూబ్లీ బైపోల్: ఒకే ఎమ్మెల్యే.. ఎక్కడా తగ్గట్లే

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ మొత్తం ఇక్కడే మోహరించింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు.. ఇక్కడ గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎలక్షన్‌ను రెఫరెండంగా భావిస్తోంది. ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఆమోదించినట్లేనని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ గెలుపుకోసం ఆరాటం.


