News October 12, 2024

న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా బుమ్రా

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫ్‌రాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా. ట్రావెలింగ్ రిజర్వ్: నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ.

Similar News

News October 12, 2024

టూత్ బ్రష్‌లపై బ్యాక్టీరియాలను చంపే వైరస్‌లు!

image

షవర్ హెడ్స్, టూత్ బ్రష్‌లో మునుపెన్నడూ చూడని కొత్త వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 614 వైరస్‌లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అవేవీ మానవాళికి హాని కలిగించేవి కాదు. పైపెచ్చు ఇవి హానికర బ్యాక్టీరియాలను చంపుతాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్‌లకు వ్యతిరేకంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ వైరస్‌లు దోహదపడతాయి.

News October 12, 2024

విమాన ఘటనపై విచారణకు ఆదేశించిన డీజీసీఏ

image

తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ <<14334728>>ఘటనపై<<>> DGCA విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. 141 మందితో ఉన్న విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పైలెట్‌తో పాటు విమాన సిబ్బందిని అభినందించారు. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

News October 12, 2024

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు పర్వానికి చేరాయి. ఆఖరి రోజైన ఇవాళ స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. దీంతో ఉత్సవాలు ముగియనున్నాయి. దీనికోసం ఇప్పటికే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.