News October 12, 2024
TODAY HEADLINES

* AP: 1.21 కోట్ల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’
* AP: ముగిసిన వైన్ షాపుల దరఖాస్తు గడువు
* TG: కేసీఆర్ 5 వేల స్కూళ్లు మూసేశారు: సీఎం రేవంత్
* TG: తెలంగాణలో సమగ్ర కులగణన.. ఇంటింటి సర్వే
* పనిచేయని ఉద్యోగులపై వేటు: మోదీ
* టాటా ట్రస్టు ఛైర్మన్‌గా నోయల్ టాటా
* రాజకీయాల్లో చేరిన నటుడు షాయాజీ షిండే
* టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్
* భారత జట్టు వైస్ కెప్టెన్‌గా బుమ్రా
Similar News
News January 19, 2026
డిజిటల్ మీడియా ఫిల్మ్ టెక్నాలజీకి ప్రోత్సాహం: CBN

AP: డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు CM CBN పేర్కొన్నారు. జూరిచ్‌లో ‘ఈరోస్ ఇన్నోవేషన్’ ఛైర్మన్ కిషోర్ లుల్లా, ప్రతినిధులు CMతో భేటీ అయ్యారు. AI, జెన్ AI, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఈరోస్ ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ తదితరాల గురించి వారు CBNకు వివరించారు.
News January 19, 2026
BJP కొత్త అధ్యక్షుడి ఘనత ఇదే

BJP జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ బిహార్ నుంచి ఈ పదవికి చేరిన తొలి నేతగా, అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా 4 సార్లు, పట్నా వెస్ట్ నుంచి ఒకసారి విజయం సాధించిన ఆయన బిహార్‌లో రహదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. BJP యువ మోర్చా అధ్యక్షుడిగా, ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా అనుభవం ఉంది. కష్టపడి ఎదిగిన నేతగా పేరొందారు.
News January 19, 2026
వేధింపులకు చెక్ పెట్టాలంటే..

ప్రస్తుతకాలంలో చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం చాలామంది మహిళలు ఉన్న ఊరు, అయిన వారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆకతాయిల వేధింపులు ఎదురైనపుడు రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. గృహ హింస, వరకట్నం బాధితులైతే 181, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 1089 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.


