News October 12, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 12, శనివారం
నవమి: ఉదయం.10.58 గంటలకు
శ్రవణం: తెల్లవారుజామున 4.27 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.15-10.47 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 6.00-6.47 గంటల వరకు
Similar News
News January 2, 2025
దీప్తి ఎవరో తెలుసా?
TG: పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అథ్లెట్ జివాంజి దీప్తికి కేంద్రం <<15045760>>అర్జున అవార్డును<<>> ప్రకటించింది. WGL కల్లెడకు చెందిన దీప్తి చిన్నతనం నుంచే మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బందిపడ్డారు. కోచ్ రమేశ్ ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి హైదరాబాద్ తీసుకొచ్చి శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో ప్రపంచ వేదికల్లో సత్తాచాటారు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్ దీప్తి.
News January 2, 2025
GOOD NEWS: వారికి రూ.20,000
AP: మత్స్యకారులకు ఏప్రిల్‌లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ.10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.
News January 2, 2025
CMR కాలేజీ ఘటనపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్
TG: మేడ్చల్ (D) కండ్లకోయలోని CMR కాలేజీ <<15044312>>హాస్టల్ ఘటనపై<<>> మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సీపీకి సూచించింది. అమ్మాయిలు బాత్ రూమ్‌లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సీజ్ చేసిన ఫోన్లలో ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.