News October 12, 2024
మణుగూరు – బెలగావి రైలు పునరుద్ధరణ

ఈనెల 16వతేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మణుగూరు – బెలగావి రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలును దాదాపు 5 నెలల 15 రోజులు మాత్రమే తాత్కాలికంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ రైలును మణుగూరు నుంచి బెలగావి వరకు శాశ్వతంగా నడపాలని, అలాగే డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్యలో గల అన్ని స్టేషన్లలో ఆపాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 10, 2025
ఖమ్మం రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రమాద భయం

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని ఆరబోయడానికి మార్కెట్ యార్డుల కొరత ఉండటంతో రైతులు పంటను ప్రధాన రహదారులపైనే పోస్తున్నారు. దీంతో వడ్ల రాశులు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News November 10, 2025
ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్డేట్ యాప్లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.
News November 10, 2025
‘వనజీవి రామయ్య’ బయోపిక్కు భట్టికి ఆహ్వానం

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రావాలని చిత్ర దర్శకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా తీయడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.


