News October 12, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 12, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:18 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:56 గంటలకు
ఇష: రాత్రి 7.09 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 31, 2026

తొందర్లోనే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్: CBN

image

AP: మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తొందర్లోనే అమలు కానుందని CM చంద్రబాబు వెల్లడించారు. ‘మహిళా నాయకత్వం రావాలి. మగవారితో సమానంగా ముందుకెళ్లాలి. వారికి NTR ఆస్తి హక్కు కల్పిస్తే నేను కాలేజీల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చాను. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొందర్లోనే అది జరుగుతుంది. మహిళలు పెద్దఎత్తున MLAలు, MPలు అవుతారు’ అని కుప్పంలో పేర్కొన్నారు.

News January 31, 2026

బోండా గొంతులో ఇరుక్కుని మృతి

image

TG: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి టిఫిన్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మధురానగర్ పీఎస్ పరిధిలోని రహ్మత్ నగర్‌లో గురువారం అర్ధరాత్రి లారీ డ్రైవర్ దాసరి రమేశ్ (45) ఓ టిఫిన్ సెంటర్ వద్ద బోండాలు కొన్నాడు. అక్కడే కూర్చొని తింటుండగా ఓ బోండా గొంతులో ఇరుక్కుంది. ఊపిరాడక తీవ్రంగా ఇబ్బందిపడ్డ ఆయన కాసేపటికే ప్రాణాలు వదిలాడు.

News January 31, 2026

ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే

image

ఐరన్ లోపించినప్పుడు, శరీరం తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనికోసం ఐరన్ కోసం ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. వీటిని పరగడపున తీసుకుంటే చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్‌తో పాటు వేరే మందులు తీసుకోవద్దు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న గంట వరకూ డెయిరీ ప్రోడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు.