News October 12, 2024

ఒక్కో కుటుంబంపై అప్పు ఎంతంటే?

image

TG: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. జాతీయ సగటు రూ.90,372గా ఉంది. అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92శాతానికి పెరిగింది. ఇందులో జాతీయ సగటు 52%. ఇక దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తొలి 2 రాష్ట్రాలు TG(92%), AP(86%) కావడం గమనార్హం. మరోవైపు ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే 3.8 నుంచి 4.1కి పెరిగింది.

Similar News

News November 3, 2025

ఏపీ అప్డేట్స్

image

* ఈ నెల 20న తిరుమలకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, 21న శ్రీవారి దర్శనం
* నేడు లండన్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
* కుల, చేతివృత్తిదారులకు ఎలాంటి పరికరాలు(ఆదరణ 3.0) అందించాలనే విషయమై మంత్రి సవిత అధ్యక్షతన నేటి నుంచి 3 రోజుల పాటు సమావేశాలు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల డిమాండ్

News November 3, 2025

శుభ కార్యాలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

image

హిందూ ఆచారాల ప్రకారం.. శుభకార్యాల వేళ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటారు. అయితే ఇది అలంకరణలో భాగమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పండితులు. ‘పండుగలు, శుభ కార్యాల వేళ ఇంటికి ఎక్కువ మంది వస్తుంటారు. వారి వల్ల కలుషితమైన గాలిని మామిడి ఆకులు శుద్ధి చేస్తాయి. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి చెట్టు కల్పవృక్షం’ అని అంటున్నారు.

News November 3, 2025

వేప మందుల వాడకంలో మెళకువలు

image

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.