News October 12, 2024
ఇవాళ పాలపిట్టను ఎందుకు చూడాలంటే?

దసరా రోజున పాలపిట్టను చూస్తే అదృష్టం, విజయం వరిస్తుందని నమ్మకం. రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే సమయంలో పాలపిట్టను చూడటంతో విజయం సాధించాడని పురాణ గాథ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు పాలపిట్టను చూడటంతో కౌరవులను గెలిచారని మరోగాథ. ఈ నమ్మకంతో గ్రామాల్లో దసరా రోజున సాయంత్రం ప్రజలు పాలపిట్టను చూసేందుకు పొలాలు, ఊరి చివరకు వెళ్తారు.
Similar News
News January 13, 2026
భోగి మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలి: CM

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి జరుపుకుంటున్న ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షిస్తున్నా. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని.. అందుకు అండగా ఉంటానని తెలియజేస్తున్నా. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News January 13, 2026
రైల్వేకు రూ.1.3 లక్షల కోట్లు!.. సేఫ్టీకి ప్రయారిటీ

రైలు ప్రమాదాల నివారణకు వీలుగా కేంద్రం రానున్న బడ్జెట్లో ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వనుందని ‘మింట్’ పేర్కొంది. ‘బడ్జెట్లో రైల్వేకు ₹1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చు. ఇందులో సగం సేఫ్టీకి ఖర్చు చేస్తారు. ట్రాక్‌ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్‌గ్రేడ్, ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్‌ను విస్తరిస్తారు’ అని తెలిపింది. కాగా ఇటీవల ప్రమాద ఘటనలపై రాజకీయ విమర్శలతో కేంద్రం రైల్వేపై దృష్టి సారించింది.
News January 13, 2026
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.


