News October 12, 2024
BIG ALERT: అతి భారీ వర్షాలు

AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.
Similar News
News February 4, 2026
కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదు: KTR

TG: మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ <<19051424>>వాడిన<<>> భాషను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. హార్వర్డ్‌లో ఎన్ని కోర్సులు చేసినా రేవంత్ తన భాషను మార్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన KCR వంటి నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజవదంటూ మండిపడ్డారు.
News February 4, 2026
వార్మప్ మ్యాచ్.. SAకి భారీ టార్గెట్

సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20WC వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(53), తిలక్ వర్మ(45), అక్షర్ పటేల్(35), సూర్యకుమార్(30), పాండ్య(30) రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్, కోర్బిన్, అన్‌రిచ్, మఫాకలు తలో వికెట్ తీశారు. విజయం కోసం SA బ్యాటర్లు 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి.
News February 4, 2026
ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్: CM

AP: నెట్ జీరో కాన్సెప్టుతో అన్ని వనరులను సమగ్రంగా వినియోగించుకొని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను ముందుకు తీసుకెళ్లాలని CM CBN ఆదేశించారు. బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చే పథకాలకు రూపకల్పన చేయాలని బీసీ వెల్ఫేర్ సమీక్షలో సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు యోచిస్తున్నామన్నారు. ఆదరణ-3 ద్వారా కుల వృత్తుల వారీగా ఆధునిక పనిముట్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.


