News October 12, 2024

అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు: శ్రీకాకుళం ఎస్పీ

image

విజయదశమి సందర్భంగా గ్రామాల్లో అమ్మవారికి కొమ్మలు వేసే సమయంలో వర్గాలుగా వీడి కొట్లాటకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల వారీగా రౌడీ షీట్ నమోదైన వారు, ఆకతాయిల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయన్నారు. అలాంటివారిపై పూర్తి నిఘా పెట్టామని ఆయన వెల్లడించారు.

Similar News

News November 24, 2024

శ్రీకాకుళం: హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు-కలెక్టర్

image

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల పేరుతో పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు అందించలేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కచ్చితంగా అందజేయాలని కళాశాలలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని అన్నారు.

News November 24, 2024

ఆడలి ఘాట్ వద్ద ప్రమాదం.. మహిళ మృతి

image

సీతంపేట మండలం ఆడలి వ్యూ పాయింట్ సందర్శించి తిరిగి వస్తున్న కుటుంబం వేలం గూడ ఘాట్ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. గాయాలైన వ్యక్తిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని సీతంపేట ఎస్ఐ అమ్మనరావు దర్యాప్తు చేపడుతున్నారు.

News November 24, 2024

IPL వేలంలో మన శ్రీకాకుళం కుర్రాడు.!

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన శ్రీకాకుళం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.