News October 12, 2024

NZB: ప్రారంభమైన దసరా సందడి..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే దసరా సందడి నెలకొంది. పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పలు దుకాణా దారులు స్పెషల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్‌లను సైతం అందిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వాహనాలు, తమకు జీవనాధారమైన వ్యాపార కేంద్రాలకు పూలు అలంకరించుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.

Similar News

News December 22, 2024

NZB: మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయం: మంత్రి

image

ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆదివారం రెంజల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ముందుకెళ్తున్నామన్నారు.

News December 22, 2024

కామారెడ్డి: ఫలితాలు విడుదల

image

శనివారం నిర్వహించిన కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. స్టెనో 14, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ 42, రికార్డ్ అసిస్టెంట్  పరీక్షకు 78 మంది పరీక్షలకు హాజరయ్యారు. 40% మార్కులు పొందిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ జడ్జ్ వరప్రసాద్ తెలిపారు. 2వ స్టేజి పరీక్షలు ఈ నెల 28న జరుగుతాయని ఫలితాలకు కోర్టు వెబ్సైట్ చూడాలని సూచించారు.

News December 22, 2024

NZB: బేస్‌బాల్ ఛాంపియన్‌గా జిల్లా మహిళా జట్టు

image

నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు బేస్‌బాల్ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుంది. సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ బేస్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుతో నిజామాబాద్ జిల్లా జట్టు తలపడింది. ఇందులో 3-6 పరుగుల తేడాతో నిజామాబాద్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.