News October 12, 2024
కోదాడ: గిరిజన బిడ్డ.. సత్తా చాటింది..!

ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోదాడ మండలం బాలాజీ నగర్‌కు చెందిన గిరిజన విద్యార్థిని బానోతు శివ ప్రియాంక ఎస్జీటీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. గిరిజన పేద కుటుంబానికి చెందిన శివ ప్రియాంక తల్లిదండ్రులు ప్రోత్సాహంతో విద్యను అభ్యసిస్తూ మొదటి సారి డీఎస్సీ పరీక్షలు రాశారు. కాగా, శివ ప్రియాంక ఎస్టీ విభాగంలో 4వ ర్యాంక్ సాధించారు. దీంతో పలువురు గ్రామస్థులు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 23, 2026
రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకుందాం: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా రంజాన్ మాసాన్ని మతసామరస్యంతో, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల్లో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 23, 2026
NLG: రా మెటీరియల్ సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

అనుముల, డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల(ITI)లకు రా మెటీరియల్ సరఫరా చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ ITI ప్రిన్సిపల్ తెలిపారు. సుమారు రూ.31,93,200 వ్యయంతో ఈ ముడి సరుకులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సరఫరాదారులు టెండర్ ఫారాలు, పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News January 23, 2026
పోలీసుల నిఘాలో చెరువుగట్టు

చెరువుగట్టు జాతరలో భక్తుల రక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ వ్యూహాన్ని రచించింది. వెయ్యి మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అత్యాధునిక ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతతో పాత నేరస్థులపై నిఘా ఉంచడంతో పాటు, క్యూలైన్లు, పార్కింగ్ వద్ద ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ-టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి.


