News October 12, 2024

మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే చివరిదైన 3వ T20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో ఇవాళ వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే ఛాన్సుంది.

Similar News

News January 24, 2026

స్కాట్లాండ్ ఎంట్రీ.. కొత్త షెడ్యూల్ ఇదే

image

ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న T20WCలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడనున్నట్లు ICC ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను సవరించింది. గ్రూప్-Cలో స్కాట్లాండ్ ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ENG, 17న నేపాల్‌తో తలపడనుంది. మరోవైపు PM ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్న పాకిస్థాన్(PCB) స్థానంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ ఆ జట్టు తప్పుకుంటే పపువా న్యూ గినియా(PNG) ఆడే అవకాశం ఉంది.

News January 24, 2026

వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎలా ఉండాలంటే?

image

బాత్రూం విషయంలో అశ్రద్ధ తగదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పగిలిన అద్దాలు, వాడని వస్తువులు, విడిచిన బట్టలు ఉంచొద్దని అంటున్నారు. ‘దీనివల్ల ప్రతికూల శక్తి పెరిగి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. బాత్రూం విశాలంగా ఉండాలి. బకెట్లను నీళ్లతో నింపి ఉంచడం మంచిది. వాటర్ లీకేజీ వల్ల సమస్యలొస్తాయి. శరీరాన్ని శుద్ధి చేసే ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 24, 2026

ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్

image

RBI, నాబార్డు, PSGICల్లోని ఉద్యోగులు, రిటైరైన వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన, పెన్షన్ సవరణకు ఆమోదం తెలిపింది. దీని కోసం ₹13500Cr వెచ్చించనుంది. PSGICల్లో వేతనం 12.41%, పెన్షన్ 30% పెరుగుతుంది. నాబార్డులో జీతం 20% మేర, RBI, నాబార్డులలో పెన్షన్ 10% హైక్ అవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా 93,157 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు 2022 AUG, NOV నుంచి వర్తిస్తుంది.