News October 12, 2024

కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు 5,128 దరఖాస్తులు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,128 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,013 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 105 దుకాణాలకు 2,115 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14న కర్నూలు జడ్పీ సమావేశ హాల్‌లో లక్కీ డిప్ తీయనున్నారు.

Similar News

News September 15, 2025

పూర్వ విద్యార్థుల సాయం హర్షణీయం: MP

image

KNL: పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. నగరంలోని రాక్ వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976-1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ఎంపీ పాల్గొని ఆరోజులను గుర్తు చేసుకున్నారు. రాక్ వుడ్ పాఠశాలను తిరిగి స్కూల్, లేదా స్టడీ సర్కిల్‌గా ఏర్పాటు చేసేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.

News September 15, 2025

ఉద్యోగాల పేరుతో మోసపోకండి: కర్నూలు SP

image

ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని.. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు ఉన్నారు.

News September 15, 2025

నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

image

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.