News October 12, 2024
నెల్లూరు జిల్లాలో మద్యం షాపులకు 3,833 దరఖాస్తులు

నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల కోసం గడువు ముగిసే సమయానికి 3,833 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు అధికారులు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో మొత్తం 182 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కాగా దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.76.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు వారు వెల్లడించారు.
Similar News
News November 12, 2025
నెల్లూరు: ఆక్వా రైతులకు గమనిక

ఆక్వా రైతులందరికీ విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇస్తామని నెల్లూరు RDO అనూష ప్రకటించారు. రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టం-2020 ద్వారా అనుమతులు పొందిన వాళ్లే అర్హులన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతులు సచివాలయంలో రూ.1000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, పాస్ బుక్, ఆటో క్యాడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్, మీటర్ నంబర్, వాల్టా చట్టం అఫిడవిట్ పేపర్లు అవసరమని చెప్పారు.
News November 12, 2025
HYD ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు.. నెల్లూరు వాసి అరెస్ట్

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో CISF అధికారులు అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అబుదాబీ నుంచి HYD వచ్చిన నెల్లూరు వాసి జయరాం సూర్యప్రకాశ్, చెన్నై వాసి మహమ్మద్ జహంగీర్ లగేజీలను చెక్ చేయగా సుమారు రూ.2 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించారు. 8 డ్రోన్లు, 65 ఐఫోన్లు, 50 ఐవాచ్‌లు, 4 వీడియో గేమ్స్ పరికరాలు, డ్రోన్స్‌ను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
News November 12, 2025
25వ తేదీ వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం: DEO

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆన్లైన్ ద్వారా ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు DEO డాక్టర్ ఆర్.బాలాజీ రావు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు www.bse.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని సూచించారు. పరీక్ష రాసేందుకు తక్కువ వయసు ఉన్న విద్యార్థులు అండర్ ఏజ్ సర్టిఫికెట్ కోసం రూ.300 ఆన్లైన్లో చెల్లించాలన్నారు.


