News October 12, 2024

ఖమ్మం: శ్రీలక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

image

విజయ దశమి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.

Similar News

News September 18, 2025

అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

image

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్‌ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.

News September 17, 2025

నిరంతర విద్యుత్‌ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

image

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

image

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.