News October 12, 2024

డిగ్రీ పూర్తైన వారికి BIG ALERT

image

ఏపీలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఓట్ల నమోదుకు ఈసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఉమ్మడి తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తైన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆధార్, డిగ్రీ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, ఫొటో సహా మరికొన్ని వివరాలను అప్‌లోడ్ చేయాలి. నవంబర్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటు నమోదు కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News October 12, 2024

17న కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

image

హ‌రియాణాలో BJP ప్ర‌భుత్వం Oct 17న కొలువుదీర‌నుంది. పంచ‌కుల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో నాయబ్ సింగ్ సైనీ మ‌రోసారి CMగా ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు. ఆయ‌న‌తోపాటు నూత‌న మంత్రివ‌ర్గ స‌భ్యులు కూడా ప్ర‌మాణం చేయనున్నారు. ప్ర‌ధాని మోదీ, BJP పాలిత రాష్ట్రాల CMలు కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. కొత్త స‌భ్యుల‌కు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ద‌క్క‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

News October 12, 2024

జామ్‌నగర్ సింహాసనానికి వారసుడిగా జడేజా

image

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సంస్థాన మహారాజు శత్రుశల్య సిన్హ్‌జీ దిగ్విజయ్ సిన్హ్‌జీ జడేజా తమ వారసుడిగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేరును ప్రకటించారు. తమ వారసుడిగా ఉండేందుకు అజయ్ అంగీకరించారని ఓ ప్రకటనలో తెలిపారు. జడేజా 1992-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడారు. అనంతరం కొన్ని సినిమాల్లోనూ నటించారు. గత ఏడాది వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా కూడా పనిచేశారు.

News October 12, 2024

ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే పాఠాలు నేర్చుకుంటారు?: రాహుల్ గాంధీ

image

మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్నటి రైలు ప్రమాదం బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని గుర్తుచేసింది. లెక్కలేనన్ని ప్రమాదాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోవడం లేదు. జవాబుదారీతనం అనేది పైనుంచే మొదలవుతుంది. ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే ఈ సర్కారు కళ్లు తెరుస్తుంది?’ అని మండిపడ్డారు.