News October 12, 2024

చిత్తూరులో ప్రజా పరిష్కార వేదిక వాయిదా

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 15వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈనెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని 15వ తేదీకి మారుస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.

Similar News

News January 17, 2026

చిత్తూరు: సచివాలయాలకు నూతన నిబంధనలు

image

సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో సేవలు అందించాలని ఆదేశించింది. ఆ మేరకు ఉదయం, సాయంత్రం సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి. సమయపాలన పాటించకపోతే విధులకు హాజరుకానున్నట్లు గుర్తించనున్నారు. లీవ్ పెట్టేందుకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించింది.

News January 17, 2026

చిత్తూరు నగరంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

చిత్తూరు నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు.. గుడిపాల (M) 190. రామాపురానికి చెందిన వాసుదేవ నాయుడు గంగాసాగరం వద్ద బైకుపై వస్తూ మలుపు తిరుగుతుండగా.. వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News January 17, 2026

చిత్తూరు: సింగిరి గుంట వద్ద రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం

image

చౌడేపల్లె మండలంలోని సింగిరి గుంట వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.