News October 12, 2024
జామ్‌నగర్ సింహాసనానికి వారసుడిగా జడేజా
గుజరాత్‌లోని జామ్‌నగర్ సంస్థాన మహారాజు శత్రుశల్య సిన్హ్‌జీ దిగ్విజయ్ సిన్హ్‌జీ జడేజా తమ వారసుడిగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేరును ప్రకటించారు. తమ వారసుడిగా ఉండేందుకు అజయ్ అంగీకరించారని ఓ ప్రకటనలో తెలిపారు. జడేజా 1992-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడారు. అనంతరం కొన్ని సినిమాల్లోనూ నటించారు. గత ఏడాది వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా కూడా పనిచేశారు.
Similar News
News December 22, 2024
రోహిత్‌కు గాయం!
టీమ్ ఇండియాకు నెట్ సెషన్లలో వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ రాహుల్ చేతికి గాయం కాగా తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డారు. ఎంసీజీ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో ఆయన నొప్పితో పక్కన కూర్చుండిపోయారు. అయితే మ్యాచ్ జరిగేందుకు ఇంకా 4 రోజులున్న నేపథ్యంలో ఆటగాళ్లు కోలుకుంటారని టీమ్ ఇండియా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
News December 22, 2024
ఈ ఏడాది అత్యంత లాభాలు చూసిన సినిమా ఏదంటే..
ఈ ఏడాది అత్యధిక శాతం లాభాలు పొందిన తెలుగు సినిమా ఏది? పుష్ప-2 సినిమా ఇప్పటికే రూ.1500 కోట్ల మార్కును దాటేసినా తొలి స్థానంలో ఉన్నది ఆ మూవీ కాదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి వరల్డ్ వైడ్ రూ.350 కోట్ల వరకూ వసూలు చేసిన హనుమాన్ మూవీ అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమాకు 650 శాతం నుంచి 775 శాతం మేర లాభాలు వచ్చినట్లు అంచనా.
News December 22, 2024
తీవ్ర వరదలు.. కటిక కరవు
గ్లోబల్ వార్మింగ్ కారణంగా రానున్న సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాలు తీవ్ర వరద, మరికొన్ని తీవ్రమైన కరవును ఎదుర్కోనున్నాయి. ఐఐటీ గువాహటి, ఐఐటీ మండీ, CSTEP అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరదలు, 91 జిల్లాలు తీవ్ర కరవు కేటగిరీలో ఉన్నాయంది. ఏపీలోని కృష్ణా, ప.గోదావరి, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు, విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు కరవు సమస్య పొంచిఉన్నట్లు తేలింది.