News October 12, 2024
కొండారెడ్డిపల్లికి చేరుకనన్న సీఎం రేవంత్ రెడ్డి

వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన సీఎంకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. గ్రామస్థులు బోనాలు, బతుమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. సీఎం రాకతో కొండారెడ్డిపల్లికో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
Similar News
News January 16, 2026
రేపు మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

పాలమూరు జిల్లాకు రేపు సీఎం ఏ.రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని జిల్లా పోలీసులు తెలిపారు. పిస్తా హౌస్ బైపాస్ నుంచి రాయచూర్ రోడ్డు, భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్, పీయూ కాలేజ్ కొత్త బైపాస్ నుంచి పిస్తా హౌస్ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలను పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.
News January 16, 2026
పాలమూరుకు సీఎం రావడం శుభ పరిణామం: ఎమ్మెల్యే

పాలమూరు పట్టణం మున్సిపాలిటీగా ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తుండడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు అభివృద్ధికి సీఎం ప్రత్యేకదృష్టి సారించారని తెలిపారు.
News January 14, 2026
పాలమూరు: బొటానికల్ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు

జడ్చర్ల డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ మరో అరుదైన జీవజాతికి నిలయమైంది. ఇక్కడ ‘కాప్రినొప్సిస్ నివియా’ అనే అరుదైన పుట్టగొడుగును ప్రొఫెసర్ సదాశివయ్య బృందం గుర్తించింది. దీని ఫలనాంగాలు మంచు రంగులో ఉండి, మంచుతో కప్పబడినట్లు కనిపిస్తాయి. అందుకే దీనిని ‘స్నోయి ఇంకాంప్’ అని పిలుస్తారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే తన జీవిత చక్రాన్ని ముగిస్తుందని ప్రొఫెసర్ వివరించారు.


