News October 12, 2024
తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా అమలు చేస్తాం: మంత్రి తుమ్మల

TG: రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్‌ను ఆయన సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.
Similar News
News September 17, 2025
BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News September 17, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.