News October 12, 2024
‘రంజీ ట్రోఫీ’కి ఆ పేరు ఎలా వచ్చింది?

నవానగర్ (ప్రస్తుత జామ్‌నగర్) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గతంలో దీన్ని జడేజా రాజ్‌పుత్ రాజవంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్‌గా పిలుస్తారు. నవానగర్‌ను 1907 నుంచి రంజిత్‌సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయన ప్రపంచ ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయన పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జరుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.
Similar News
News March 11, 2025
కూటమి MLC అభ్యర్థుల ఆస్తుల వివరాలు

AP: MLA కోటా MLC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఐదుగురు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. వారి ఆస్తుల వివరాలిలా..
* బీద రవిచంద్ర- రూ.41కోట్లు
* బీటీ నాయుడు- రూ.5.68కోట్లు
* కావలి గ్రీష్మ- రూ.1.78కోట్లు
* సోము వీర్రాజు- రూ.2.81కోట్లు
* నాగబాబు- రూ.70.32కోట్లు
News March 11, 2025
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

TG: తెలంగాణ భవన్‌లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 17 లేదా 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
News March 11, 2025
తిరుమల: 13 కంపార్టుమెంట్లలో భక్తులు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,746 మంది దర్శించుకోగా, 23,649 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.