News October 12, 2024

జమ్మి ఆకులే ‘బంగారం’!

image

తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆకులను ఆత్మీయులకు పంచుతారు. కొందరు పూజగదిలో భద్రపరుస్తారు. కుబేరుడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలో బంగారాన్ని కురిపించాడని, అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారని పురాణాలు చెబుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి. దీని గాలి పీల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Similar News

News October 12, 2024

పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్

image

ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇంకుడు గుంతలు, పశువుల శాలలు, రోడ్లు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News October 12, 2024

HATSOFF: పొదల్లో పసిబిడ్డ.. దత్తత తీసుకున్న పోలీసు

image

అది యూపీలోని ఘజియాబాద్. పాపం ఇంకా కళ్లు కూడా తెరవని ఓ పసిగుడ్డును ఎవరో కఠినాత్ములు పొదల్లో వదిలేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ఆ బుజ్జాయిని చూసి చలించిపోయారు. పెళ్లై ఆరేళ్లైనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ చంటిదాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

News October 12, 2024

T20ల్లో టీమ్ ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు

image

35 బాల్స్- రోహిత్ శర్మ vs శ్రీలంక
40- సంజూ శాంసన్ vs బంగ్లాదేశ్
45- సూర్య కుమార్ యాదవ్ vs శ్రీలంక
46*- అభిషేక్ శర్మ vs జింబాబ్వే
46- కేఎల్ రాహుల్ vs వెస్టిండీస్