News October 12, 2024
చెర్రీ, బాలయ్య సినిమాల నుంచి అప్‌డేట్స్
మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు విజయ దశమి రోజున అప్‌డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్‌తో చరణ్ పిక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణతో బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న NBK109 మూవీని సంక్రాంతికి తీసుకురానున్నట్లు ఆ మూవీ టీమ్ ప్రకటించింది. దీపావళికి టైటిల్, టీజర్‌ను వదలనున్నట్లు తెలిపింది.
Similar News
News January 2, 2025
డాక్టర్లు చనిపోయాడన్నారు.. స్పీడ్ బ్రేకర్ బతికించింది..!
మహారాష్ట్రలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి చనిపోయాడని వైద్యులు ప్రకటించడంతో ఇంటికి తీసుకెళ్తుండగా బతికాడు. కొల్హాపూర్‌కు చెందిన పాండురంగ్ ఉల్పే(65)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. మృతదేహాన్ని అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద చేతి వేళ్లు కదిపాడు. మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు.
News January 2, 2025
రియల్ హీరో.. అంధుడైనా 13 మందిని కాపాడాడు!
చూపు లేకపోయినా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి రక్షించే భుల్లు సాహ్నిని నెటిజన్లు అభినందిస్తున్నారు. బిహార్‌లోని దుమ్‌దుమాకు చెందిన భుల్లు సాహ్ని ఎందరికో నిజమైన స్ఫూర్తి అని కొనియాడుతున్నారు. ఆయన గంగ, భాగమతి, కమల, బూధి గండక్ వంటి నదుల్లో మునిగిపోయి సాయం కోసం ఎదురుచూసిన 13 మందిని ప్రాణాలతో బయటకు తీశారు. తన తండ్రి నుంచి ఈత, చేపలు పట్టడాన్ని ఆయన నేర్చుకున్నారు. ఈ రియల్ హీరోకు సెల్యూట్.
News January 2, 2025
సామాన్యుడి జీవితం అతలాకుతలం: ఖర్గే
NDA ప్రభుత్వం దేశంలో సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో సామాన్యుడి జీవితం అతలాకుతలమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. పరోక్ష పన్నులతో సామాన్యుల సేవింగ్స్ తగ్గిపోతున్నాయన్నారు. బంగారం రుణాల్లో 50% పెరుగుదల, బంగారు రుణ NPAలలో 30% వృద్ధి, ప్రజల వస్తు-సేవల కొనుగోలు శక్తి మందగించడం, కార్ల కొనుగోళ్లు పడిపోవడం, కీలక రంగాల్లో సరైన వేతన పెంపు లేకపోవడం ఇందుకు నిదర్శనమని వివరించారు.