News October 12, 2024
మహిళల టీ20 WC.. భారత్ సెమీస్ చేరాలంటే?

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. భారత్ సెమీస్ చేరాలంటే రేపు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. భారీ తేడాతో గెలిస్తే సులభంగా సెమీస్ చేరుతుంది. లేదంటే కివీస్ ఆడే చివరి 2 మ్యాచుల్లో ఓడాలి లేదా ఒకదాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్‌తో భారత్ సెమీస్ చేరుతుంది.
Similar News
News February 5, 2026
కానుగ నీడ, కన్నతల్లి నీడ

ప్రకృతిలో లభించే నీడలలో కానుగ చెట్టు నీడ అత్యంత చల్లనిదిగా పరిగణించబడుతుంది. ఇతర చెట్ల కంటే దీని ఆకులు దట్టంగా ఉండి, ఎండను అసలు చొరబడనీయకుండా ఉంటాయి. అందుకే ఈ చెట్టు కింద సేద తీరితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక బిడ్డకు తన కన్నతల్లి ఒడి ఎంతటి భద్రతను, చల్లదనాన్ని, ఓదార్పును ఇస్తుందో.. ఎండలో అలసిపోయిన బాటసారికి కానుగ చెట్టు నీడ అంతటి ఉపశమనాన్ని ఇస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 5, 2026
WPL-2026: ఫైనల్ క్వీన్ ఎవరో?

WPL-2026లో ఇవాళ ఢిల్లీ, బెంగళూరు మధ్య వడోదర వేదికగా ఫైనల్ జరగనుంది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ తొలి టైటిల్‌పై కన్నేసింది. ఈ సీజన్‌లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న RCB రెండో సారి ట్రోఫీ నెగ్గాలని చూస్తోంది. ఇరు జట్లు 9 సార్లు తలపడగా ఆరు విజయాలతో ఢిల్లీదే పైచేయిగా ఉంది. అయినా 2024 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడటం DCని కలవరపరుస్తోంది.
మ్యాచ్: 7.30pm, లైవ్: జియో హాట్‌స్టార్, Star Sports.
News February 5, 2026
ఫిరాయింపు ఆరోపణలు.. ఆ ఇద్దరే బాకీ!

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAలలో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్, సంజయ్, గూడెం మహిపాల్, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు. దానం అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18కి, కడియంకు 19కి విచారణను స్పీకర్ వాయిదా వేశారు.


