News October 12, 2024

భారీ వర్ష సూచన.. అధికారులకు హోంమంత్రి ఆదేశాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్ఠ పర్చాలని అన్నారు.

Similar News

News October 13, 2024

తిరుమలలో వైభవంగా ధ్వజారోహణం

image

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి మలయప్పస్వామికి తిరుచ్చిపల్లకి సేవ నిర్వహించారు. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇవాళ ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం ఘట్టాన్ని పండితులు నిర్వహించారు. దాదాపు 15 లక్షల మంది బ్రహ్మోత్సవాలకు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు.

News October 13, 2024

అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం

image

AP: కర్నూలు(D) దేవరగట్టులో బన్నీ ఉత్సవానికి( కర్రల సమరం) సర్వం సిద్ధమైంది. మాళమ్మ, మల్లేశ్వరస్వామికి అర్ధరాత్రి 12గంటలకు కళ్యాణం జరిపించిన అనంతరం విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. CCTVలు, డ్రోన్లతో నిఘా, వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.

News October 12, 2024

OTTలపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు

image

దేశంలో OTTలలో చూపుతున్న కంటెంట్ నైతిక అవినీతి (Moral Corruption)కి కారణమవుతోందని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని RSS చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ‘OTTలలో చూపే విషయాలు అసహ్యంగా ఉంటాయి. వాటి గురించి మాట్లాడినా అసభ్యకరంగా ఉంటుంది. నైతిక అవినీతికి ఇదీ ఒక కారణం. కాబట్టి దీన్ని చట్ట ప్రకారం నియంత్రించాలి. సోషల్ మీడియా ఉన్నది అశ్లీలత, అసభ్యత వ్యాప్తి చేయడానికి కాదు’ అని పేర్కొన్నారు.