News October 12, 2024

కేసీఆర్ ఇంట దసరా వేడుకలు

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సతీమణి, కుమారుడు, కోడలు, మనుమరాలుతో గులాబీ దళపతి వేడుకల్లో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన మనుమడు హిమాన్షు అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. తొలిసారిగా కుటుంబం దగ్గర లేకుండా దసరా చేసుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత బయటికొచ్చిన తమ అధినేత ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

Similar News

News September 17, 2025

అల్లూరి: పవన్ కళ్యాణ్ మంచి మనసు

image

ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే రహదారి అధ్వాన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోడ్డుపై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏలేశ్వరం-అడ్డతీగల మధ్య 10.5కి.మీ రోడ్డులో గుంతలు పూడ్చి, మరమ్మతులు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో పవన్ మంచి మనసును స్థానికులు కొనియాడుతున్నారు.

News September 17, 2025

ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు

image

PM మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల సంక్షేమం, వికసిత్ భారత్ కోసం మీ సంకల్పం మాకు స్ఫూర్తి’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘రాజకీయాలంటే సేవ అని, అధికారం కాదు త్యాగమని నేర్పిన ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సంజయ్ అన్నారు. PM మోదీకి ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ LoP రాహుల్ గాంధీ, TG CM రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

కోళ్లలో పుల్లోరం వ్యాధి – లక్షణాలు

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.