News October 12, 2024

‘RAPO 22’ మూవీ అనౌన్స్‌మెంట్

image

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో రామ్ పోతినేని ఓ సినిమా చేయనున్నారు. విజయదశమి సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ డైరెక్టర్ మహేశ్ బాబు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌కు ఇది 22వ చిత్రం కాగా నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్‌తో మూవీ ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది.

Similar News

News February 6, 2026

మేం బాధపడలేదు కానీ..: పాక్ కెప్టెన్

image

<<17861491>>ఆసియా కప్‌<<>>లో భారత జట్టు తీరుతో తామేమీ బాధపడలేదని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. కానీ హ్యాండ్‌షేక్, ట్రోఫీ నిరాకరించడం వంటివి జరగకూడదని, ఆటకు మంచిది కాదని చెప్పారు. ‘T20 WCలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ICC టోర్నమెంట్లలో ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే’ అని తెలిపారు. రేపు నెదర్లాండ్స్‌తో పాక్ తొలి మ్యాచ్ ఆడనుంది. 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను <<19024958>>బాయ్‌కాట్<<>> చేస్తున్నట్లు పాక్ ప్రకటించడం తెలిసిందే.

News February 6, 2026

ఇంట్లో దేవుళ్ల విగ్రహాలు పగిలిపోతే ఏం చేయాలి?

image

ఇళ్లలో పూజించిన దేవతా విగ్రహాలు పగిలినా, పటాలు చిరిగినా వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాటిని పారే నీటిలో నిమజ్జనం చేయాలని చెబుతున్నారు. చిరిగిన పటాలను పవిత్ర అగ్నిలో ఆహుతి చేయడం శ్రేయస్కరమని అంటున్నారు. ఏ పద్ధతిని అనుసరించినా దైవభావంతో గౌరవప్రదంగా చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆధ్యాత్మిక విలువలను కాపాడిన వారవుతారు అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 6, 2026

కిచెన్‌లో వాడే సిలికాన్ మూతలు సేఫేనా?

image

కిచెన్‌లో ఈ మధ్య సిలికాన్ మూతలు కామన్‌గా కనిపిస్తున్నాయి. వాడడానికి, క్లీన్ చేయడానికి ఈజీగా ఉండడమే దీనికి కారణం. అయితే ఇవి సేఫేనా అనే సందేహం చాలా మందిలో తలెత్తుతోంది. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం.. సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేసిన మూతలు సురక్షితమే. అయితే వాటిని నార్మల్ కిచెన్ టెంపరేచర్‌ దగ్గర మాత్రమే వాడాలి. లేదంటే ప్లాస్టిక్ తరహాలోనే ఆరోగ్యానికి ముప్పు తలపెడతాయి.