News October 13, 2024
ఆ విషయం ఎంతో బాధించింది: నిఖత్
తన పంచ్ పవర్ మెరుగుపర్చుకునేందుకు కోచ్ కోసం వెతుకుతున్నానని స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపారు. ‘మంచి కోచ్ దొరికితే లోపాలను సరిదిద్దుకుంటా. నేను అన్‌సీడెడ్ ప్లేయర్ కావడంతో పారిస్ ఒలింపిక్స్‌లో ఆరంభంలోనే క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యారు. ఆరోజు నాకు కలిసి రాలేదు. ఈ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వాళ్లను నేను గతంలో ఓడించా. అది తలుచుకుంటేనే బాధేస్తుంది. కానీ ఎలా పుంజుకోవాలో నాకు తెలుసు’ అని అన్నారు.
Similar News
News January 3, 2025
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!
TG: రేషన్ కార్డుదారులకు FEB లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6KGలు ఇవ్వాలని, శనివారం జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని, అందుకే 2నెలలు తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
News January 3, 2025
2 వికెట్లు డౌన్.. పెవిలియన్‌కు భారత ఓపెనర్లు
సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టుకు తొలి 10 ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో తొలుత రాహుల్ (4), తర్వాత జైస్వాల్ (10) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(4), గిల్(3) ఉన్నారు. కోహ్లీ క్రీజులోకి రాగానే తొలి బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లోకి వెళ్లింది. తొలుత అందరూ ఔట్ అని భావించినా బాల్ గ్రౌండ్‌ను తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. 9 ఓవర్లకు భారత స్కోర్ 22/2.
News January 3, 2025
వైజాగ్‌లో రేపు నేవీ డే విన్యాసాలు
AP: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవీ రేపు విశాఖలో విన్యాసాలు చేయనుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత నేవీ కృషికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డేను జరుపుతున్నారు. గత నెల 4న ఒడిశాలోని పూరీలో విన్యాసాలు నిర్వహించగా ఈ ఏడాది వాటి కొనసాగింపు వేడుకలు వైజాగ్‌లో జరగనున్నాయి.