News October 13, 2024

రతన్ టాటా ఓ ఛాంపియన్: నెతన్యాహు

image

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఛాంపియన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. ‘నాతోపాటు ఇజ్రాయెల్ ప్రజలందరూ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి’ అని ప్రధాని మోదీని ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సంతాపం తెలిపారు.

Similar News

News October 13, 2024

వీరిలో పర్మినెంట్ వికెట్ కీపర్ ఎవరో?

image

ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. టీ20ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. నిన్న బంగ్లాతో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో శాంసన్ ఈ రేసులో మరింత ముందుకు దూసుకొచ్చారు. ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి.

News October 13, 2024

డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం

image

AP: డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రూ.50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది. రాయితీ పోనూ మిగతా రుణంపై వడ్డీ ఉండదు. వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ, సేవా రంగంలో ఉన్నవారికి ఈ రాయితీ రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న మొత్తాన్ని 24 నుంచి 60 నెలల్లో వాయిదా పద్ధతుల్లో తీర్చాల్సి ఉంటుంది. రాయితీని చివర్లో మినహాయిస్తారు.

News October 13, 2024

బ్యాక్ట్రియన్ ఒంటెల‌కు శిక్షణ ఇస్తున్న భారత సైన్యం

image

లద్దాక్ స‌రిహ‌ద్దుల్లో ప‌హారా, స‌ర‌కు ర‌వాణా కోసం భార‌త సైన్యం కొత్త మార్గాల‌ను అన్వేషిస్తోంది. బ్యాక్ట్రియన్ ఒంటెల‌కు DIHAR శిక్ష‌ణ ఇస్తోంది. పురాత‌న కాలంలో దేశాల మధ్య వ‌ర్త‌క వ్యాపారానికి వీటిని ఉప‌యోగించేవార‌ని, అయితే వాటిని మ‌చ్చిక చేసుకొనే నైపుణ్యాన్ని భార‌త్‌ కోల్పోయిన‌ట్టు కల్నల్ రవికాంత్ శర్మ తెలిపారు. ఇవి అరుదైన వాతావ‌ర‌ణంలో సైతం బ‌రువులు మోస్తూ 2 వారాల‌పాటు ఆహారం లేకుండా జీవించ‌గ‌ల‌వు.