News October 13, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

సాధారణంగా దసరా రోజు తెలంగాణలో నాన్‌వెజ్ వంటకాలే చేస్తారు. అయితే నిన్న శనివారం కావడంతో ఎక్కువశాతం మంది వెజ్‌కే పరిమితమయ్యారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్, మటన్ కోసం మార్కెట్లకు క్యూ కడుతున్నారు. దీంతో HYDతో పాటు APలోని విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. అయితే 2 రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్‌లెస్ కేజీ రూ.240-260 మధ్య పలుకుతోంది.

Similar News

News January 15, 2026

ఇరాన్ నో ఫ్లై జోన్.. ఇండిగో విమానం జస్ట్ మిస్!

image

ప్రభుత్వ వ్యతిరేక ఉద్రిక్తతల మధ్య గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని అకస్మాత్తుగా మూసివేసింది. అయితే జార్జియా నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానం గగనతలం మూతపడటానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే సురక్షితంగా బయటపడింది. ఆ ప్రాంతాన్ని దాటిన చివరి విదేశీ ప్యాసింజర్ విమానం ఇదే కావడం విశేషం. ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఎయిరిండియా సహా పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి.

News January 15, 2026

సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో అప్రెంటిస్ పోస్టులు

image

ఢిల్లీలోని DRDOకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో 33 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc/BE/BTech/Diploma/ITI/BA/B.Com అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News January 15, 2026

పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

image

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.