News October 13, 2024

క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ నోటీసులు

image

TG: BRS నేత మన్నె క్రిశాంక్‌కు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.

Similar News

News December 28, 2025

మిరపలో ఆకు ముడత తెగులు – యాజమాన్యం

image

పొలానికి ఆఖరి దుక్కిలో ఎకరాకు 200కిలోల వేప పిండి, తిరిగి బోదెలు ఎగవేయునపుడు 100 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు మొక్కలు నాటే 15 రోజుల ముందు పొలం చుట్టూ 2-3 వరుసల మొక్కజొన్న లేదా సజ్జ మొక్కలను పెంచాలి. నాటిన తర్వాత ఎకరాకు 10 పసుపు, 10 నీలం రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి. నారు మొక్కలను నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.5 మి.లీ) మందు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి.

News December 28, 2025

ఈ కాలంలో గొంతునొప్పి ఎందుకొస్తుందంటే?

image

శీతాకాలంలో చాలామందికి గొంతునొప్పి వస్తుంది. వాతావరణం మారి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గొంతులో తేమ తగ్గుతుంది. చల్లని పదార్థాలు తిన్నా, చలి గాలిని పీల్చినా మన గొంతులోని పొరలు కుంచించుకుపోయి రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో వైరస్ సులభంగా దాడి చేస్తుంది. దీనివల్ల గొంతులో నొప్పి లేదా వాపు వస్తుంది. ఇది తగ్గాలంటే వేడి నీరు, ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 28, 2025

ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఎంతంటే?

image

క్రిస్మస్‌కు విడుదలైన ఛాంపియన్, శంబాల మూవీల కలెక్షన్లు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపిస్తున్నాయి. ఛాంపియన్ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే రూ.8.89 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. అటు శంబాల మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.4 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మరోవైపు అదే రోజున రిలీజైన ‘దండోరా’ రూ.66 లక్షల నెట్ వసూలు చేసినట్లు Sacnilk పేర్కొంది.