News October 13, 2024

విశాఖ: ‘అల్పపీడనం ఏర్పడే అవకాశం’

image

ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశముందని వెల్లడించారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

Similar News

News December 22, 2024

గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఆస్తులు సంపాదించడం నేరం: డీఐజీ

image

గంజాయి స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులు కొనుగోలు చేయడం నేరం అని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయడం గానీ, డబ్బు చెలామణి జరిగినట్టు రుజువు ఐతే జప్తు చేయబడుతుందన్నారు. లావాదేవీలు జరిపే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

News December 21, 2024

విశాఖ: అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

అక్రమంగా 11 మంది అమ్మాయిలను ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి చెన్నై ట్రైన్‌లో  తరలిస్తున్న నిందితుడు రవికుమార్‌ను శనివారం అరెస్టు చేశామని విశాఖ రైల్వే సీఐ ధనంజయ నాయుడు తెలిపారు. 11 మందిని పని పేరుతో అక్రమంగా ఆధార్ టాంపర్ చేసి గార్మెంట్‌లో పని కోసం తిమ్మాపూర్ తరలిస్తున్నారని గుర్తించామని అన్నారు. అక్రమ రవాణా, ఆధార్ టాంపరింగ్‌పై సెక్షన్ 143 (5)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

News December 21, 2024

విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు

image

విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం విశాఖలో జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, మిజోరం మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.