News October 13, 2024

ఏపీ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ ఫైర్

image

IPS పీవీ సునీల్ కుమార్‌పై ఏపీ ప్రభుత్వం <<13613964>>క్రమశిక్షణ చర్యలు<<>> తీసుకోవడాన్ని BRS నేత, మాజీ IPS ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘ఆయన ట్విటర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముంది? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని అనడం సర్వీస్ రూల్స్ ఉల్లంఘించడం ఎట్లయితది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదివితే అప్పుడైనా అర్థమైతదేమో’ అంటూ సీఎం చంద్రబాబును ప్రవీణ్ ట్యాగ్ చేశారు.

Similar News

News January 16, 2026

బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

image

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభించారు.

News January 16, 2026

110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

పుదుచ్చేరిలోని <>JIPMER<<>> 110 Sr. రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB/జనరల్ మెడిసిన్/DM/MCh/MDS అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.1,30,000 చెల్లిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in

News January 16, 2026

ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

image

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.