News October 13, 2024

బాహుబలి-2ను దాటేసిన దేవర

image

తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును ఎన్టీఆర్ ‘దేవర’ దాటేసింది. 16వ రోజున రూ.3.65కోట్లు వసూలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్(రూ.3.21కోట్లు), RRR (రూ.3.10కోట్లు), F2(రూ.2.56 కోట్లు) ఉన్నాయి. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 11, 2025

రైతు భరోసా ఎకరానికి రూ.17,500 ఇవ్వాల్సిందే: BRS

image

TG: రైతు భరోసా పథకంలో 70% మంది రైతులకు కోత పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లీకులు ఇచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. తాము పోరాటం చేయడంతోనే ఇప్పుడు వెనక్కి తగ్గి సాగు భూములన్నింటికీ ఇస్తామంటోందని పేర్కొంది. ‘2023 యాసంగికి రూ.2,500, 2024 వానాకాలానికి రూ.7,500, 2024 యాసంగికి రూ.7,500 ప్రభుత్వం రైతులకు బాకీ పడింది. ఎకరానికి రూ.17,500 ఇచ్చే వరకూ రైతుల పక్షాన పోరాడతాం’ అని తెలిపింది.

News January 11, 2025

ప్రభాస్ పెళ్లిపై చెర్రీ హింట్.. అమ్మాయిది ఎక్కడంటే?

image

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అన్‌స్టాపబుల్’ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై చరణ్ స్పందిస్తూ పెళ్లి కూతురు ఎవరో చెప్పనప్పటికీ ఎక్కడివారో చెప్పారని టాక్. అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటారని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో ఈ ఎపిసోడ్ రిలీజ్ కానుంది.

News January 11, 2025

పండగ హ్యాపీగా జరుపుకోండి ఫ్రెండ్స్!

image

చదువు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం HYDలో స్థిరపడ్డ లక్షలాది మంది సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో చాలా మంది కార్లు, బైకులపై వెళ్తున్నారు. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట జర్నీ చేయవద్దు. 80 కి.మీ వేగం దాటొద్దు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొద్దు. కచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనం నడపకూడదు.
*క్షేమంగా వెళ్లి లాభంగా రండి.