News October 13, 2024

PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ

image

రైల్వే నుంచి విమానాశ్ర‌యాల వ‌ర‌కు 7 కీల‌క రంగాల స‌మ్మిళిత వృద్ధి ల‌క్ష్యంగా ‘PM గ‌తిశ‌క్తి’ దేశ మౌలిక స‌దుపాయాల రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన పురోగ‌తికి తోడ్ప‌డిందన్నారు. ర‌వాణా వ్య‌వ‌స్థ‌ మెరుగుప‌డి ఆల‌స్యం తగ్గింద‌ని, త‌ద్వారా ఎంతో మంది కొత్త అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్నార‌ని మోదీ పేర్కొన్నారు.

Similar News

News October 13, 2024

అందుకే సినిమాలు తగ్గించాను: దుల్కర్ సల్మాన్

image

సినిమాలకు విరామం ఇవ్వడానికి గల కారణాన్ని హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గత రెండేళ్ల నుంచి సినిమాలు తగ్గించాను. గతేడాది ఒక్క సినిమానే చేశా. అది నా తప్పే. అంతకుముందు చెప్పుకోదగ్గ సినిమాలు నా నుంచి రాకవపోడమే ఇందుకు ఓ కారణం. నా ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. దీంతో కాస్త విరామం తీసుకున్నా’ అని వెల్లడించారు. కాగా ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.

News October 13, 2024

హెజ్బొల్లాతో ఘర్షణ.. 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి

image

లెబనాన్‌లోని హెజ్బొల్లాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. సౌత్ లెబనాన్‌లో హెజ్బొల్లాతో జరిగిన భీకర ఘర్షణల్లో 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్-లెబనాన్ బోర్డర్‌లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.

News October 13, 2024

ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్

image

AP: భరించలేని ఇసుక రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. పేరుకే ఉచితం కానీ వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా మీదుగా నడుస్తోంది. మేము టన్ను ఇసుక రూ.475కు సరఫరా చేశాం. ఇందులో నేరుగా రూ.375 ఖజానాకు వచ్చేవి. మా హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?’ అని జగన్ ట్వీట్ చేశారు.