News October 13, 2024
RTC ప్రయాణికులకు షాక్.. బస్సులు తక్కువ, ఛార్జీల పెంపు!

TG: దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు కనబడుతున్నాయి. వరంగల్ తదితర నగరాల నుంచి తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్టాండ్ల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక ఛార్జీలను మరోసారి పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. ఉప్పల్ నుంచి తొర్రూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సుకు OCT 9న రూ.270 వసూలు చేయగా, ఇవాళ తొర్రూర్ నుంచి ఉప్పల్ వరకు రూ.320 వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
Similar News
News February 9, 2026
సచిన్‌లానే వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలి: శశిథరూర్

అద్భుతమైన ఆటతీరుతో వైభవ్ సూర్యవంశీ <<19067167>>సంచలనాలు<<>> సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ మరింత త్వరగా ఉన్నత స్థాయికి చేరేందుకు అర్హుడని తాజాగా కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ‘గతంలో 14 ఏళ్ల జీనియస్‌ను క్రీజులో చూశాం. అతడి పేరు సచిన్ టెండూల్కర్. అతడిని ఎక్కువ కాలం వేచి ఉండనివ్వలేదు’ అని పేర్కొన్నారు.
News February 9, 2026
క్లీనింగ్ టిప్స్..

* వంటింటి అరల్లో బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది. * బాత్‌రూం షవర్ రంధ్రాలు మూసుకుపోతే… దానిని వైట్ వెనిగర్‌తో శుభ్రం చేయాలి. * ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే… కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో కలిపి వాటిని తుడిస్తే సమస్య తగ్గుతుంది. * ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
News February 9, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


