News October 13, 2024
రంప: పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు ముసివేస్తున్నామని ITDA PO కట్టా సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండ వాగులు, కాలువలు, జలపాతాలు పొంగి ప్రవహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో పర్యాటకులు ఏజెన్సీకి రావద్దని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
Similar News
News August 20, 2025
మార్వాడీ గోబ్యాక్ నినాదం చాలా తప్పు: ఛాంబర్ ఆఫ్ కామర్స్

మార్వాడీలు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చని, వారు ఈ దేశంలో భాగమని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కొందరు మార్వాడీ సోదరులకు మనస్థాపంతో కలిగిస్తే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలను మార్వాడీలు, అపార్థం చేసుకోవద్దని వారికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు.
News August 20, 2025
గోదావరి తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కందుల

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద పెరుగుతున్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గోదావరి నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం, వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలు పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News August 20, 2025
తూ.గో: ఓవర్‌స్పీడ్‌పై స్పెషల్ డ్రైవ్.. 298 కేసులు నమోదు

వేగంగా వాహనాలు నడిపిన వారిపై వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 298 ఓవర్‌స్పీడ్ కేసులు నమోదు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ డ్రైవ్ ఆగస్టు 11 నుంచి 17వ తేదీ వరకు కొనసాగిందని, ఈ-చలానాల రూపంలో రూ.3.10లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ స్పెషల్ డ్రైవ్‌ల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.