News October 13, 2024

ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్

image

AP: భరించలేని ఇసుక రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. పేరుకే ఉచితం కానీ వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా మీదుగా నడుస్తోంది. మేము టన్ను ఇసుక రూ.475కు సరఫరా చేశాం. ఇందులో నేరుగా రూ.375 ఖజానాకు వచ్చేవి. మా హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?’ అని జగన్ ట్వీట్ చేశారు.

Similar News

News October 14, 2024

జూరాల 5 గేట్లు ఎత్తివేత

image

కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో అధికారులు 5 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 74 వేల క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. దిగువకు వదిలిన నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది.

News October 14, 2024

అక్టోబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1956: బౌద్ధమతం స్వీకరించిన బీఆర్ అంబేద్కర్
1980: సినీ నటుడు శివ బాలాజీ జననం
1981: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జననం
1982: కవి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి మరణం
1994: బొగద సొరంగం పనుల ప్రారంభం
1998: అమర్త్యసేన్‌కు నోబెల్ బహుమతి
2010: సినీ రచయిత సాయి శ్రీహర్ష మరణం
2011: తెలుగు రచయిత జాలాది రాజారావు మరణం

News October 14, 2024

రిలేషన్‌షిప్‌పై శ్రద్ధాకపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

‘స్త్రీ2’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ రిలేషన్‌‌షిప్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘పార్ట్‌నర్‌తో కలిసి గడిపే సమయాన్ని ఇష్టపడతా. అతనితో కలిసి సినిమా చూడటం, డిన్నర్ వంటివి నచ్చుతాయి. పెళ్లి చేసుకున్నామా అనే దాని కంటే సరైన వ్యక్తితో ఉన్నామా? లేదా? అనేదే ముఖ్యం’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈమె బాలీవుడ్ రచయిత రాహుల్‌తో లవ్‌లో ఉన్నారని బీటౌన్‌లో ప్రచారం సాగుతోంది.