News October 13, 2024
KMM: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ మృతి

గంజాయి కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ భూక్యసాగర్ నాయక్ హైదరాబాదులో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోలీస్ అధికారుల పేర్లు చెబుతూ సూసైడ్ సెల్ఫీ వీడియో తీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు.
Similar News
News November 3, 2025
పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో హెడ్ మాస్టర్లు, మున్సిపల్ కమీషనర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ స్కూల్స్ మంజూరైన నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.
News November 3, 2025
ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి, రహదారి, స్వయం ఉపాధి, జీతం వంటి పలు సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News November 2, 2025
సెలవులపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. నేటి నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించనున్నారు.


