News October 13, 2024

ఉపాధి ద్వారా రూ.83 కోట్లతో పనులు: కలెక్టర్

image

పల్లె పండుగ వారోత్సవాలు రేపటి నుంచి వారం రోజుల పాటు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రారంభమవుతున్నాయని కలెక్టర్ రంజిత్ బాషా ఆదివారం పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, గోకులం, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 1,533 పనులకు రూ.83 కోట్లతో శంకుస్థాపనలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందన్నారు.

Similar News

News December 21, 2024

రెవెన్యూ సదస్సులో 5,586 దరఖాస్తుల స్వీకరణ

image

కర్నూలు జిల్లా పరిధిలో ఈనెల ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 5,586 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. అలాగే శనివారం ఆదోని రెవెన్యూ డివిజన్‌లోని కుర్నూరులో 11, పూలచింతలో 4, రాళ్లదొడ్డిలో 15, ఆగశన్నూరులో 11, కగళ్లులో 2, ముచ్చగేరిలో 1, ఆరెకల్‌లో 35, మార్లమడికిలో 13, కౌతాళంలో 51, పలు గ్రామాల్లో భూ సమస్యలపై అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

News December 21, 2024

రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఆన్‌లైన్లో నమోదు చేయాలి: కలెక్టర్

image

ప్రజలు, రైతులు తమ సమస్యలపై రెవిన్యూ సరస్సులలో అందించిన దరఖాస్తులను ఆన్‌లైన్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. నిర్ణీత సమయంలోపు అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తహశీల్దార్ ఆఫీసులలో రికార్డు రూములు సక్రమంగా ఉంచుకోవాలన్నారు.

News December 21, 2024

PAL ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోండి: డీఈవో

image

వెల్దుర్తి జడ్పీ బాలుర పాఠశాలను శనివారం డీఈవో శ్యాముల్ పాల్ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన PAL ల్యాబ్‌లను, తరగతి గదిని తనిఖీ చేశారు. తరగతి గది దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో ఉండి కనీస వెలుతురు లేకుండా ఉండటంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు బోధనను, టెక్నాలజీని సులభతరంగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం PAL ల్యాబ్‌లను తీసుకుని వచ్చిందన్నారు.