News October 13, 2024
కాంగ్రెస్ నేతల్ని రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు?: KTR

తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరని KTR ప్రశ్నించారు. ‘ఇటీవల ఓ మంత్రిపై ఈడీ దాడులు జరిగాయి. రూ.100 కోట్లు దొరికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీ, ఈడీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వాల్మీకి స్కామ్‌లోని రూ.40 కోట్లను తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో వాడిందని కర్ణాటకలో ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు అరెస్టులు లేవు’ అని చురకలంటించారు.
Similar News
News January 31, 2026
WPL: ముంబైపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 167/4 స్కోర్ చేయగా, అనంతరం ముంబై 20 ఓవర్లలో 156/7కి పరిమితమైంది. MI కెప్టెన్ హర్మన్ ప్రీత్ (48 బంతుల్లో 82*) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీ చరిత్రలో ముంబైపై గుజరాత్‌కి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది.
News January 31, 2026
మేడారంలో మొబైల్ ఛార్జింగ్‌కు రూ.50!

మేడారం జాతర ‘కాదేదీ వ్యాపారానికి అనర్హం’ అన్నట్లుగా మారింది. మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తుల అవసరమే కొందరికి ఉపాధినిస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లలో ఒక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు రూ.50 వసూలు చేస్తున్నారు. అలాగే వేడి నీళ్లంటూ కొందరు, స్నానాలు చేసే సమయంలో బ్యాగులకు కాపలా ఉంటూ మరికొందరు కూడా జాతరలో ఉపాధి పొందుతున్నారు.
News January 30, 2026
కాలుష్యాన్ని నివారించలేం.. నియంత్రించాలి: పవన్

AP: కాలుష్యం మన జీవితంలో అంతర్భాగమైందని DyCM పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొంతమేర పొల్యూషన్‌ను భరించకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తిస్థాయిలో నివారించలేకున్నా నియంత్రించే ప్రయత్నం చేయాలని సూచించారు. పారిశ్రామికవాడల్లో ప్రత్యేక శ్రద్ధపెట్టాలని చెప్పారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు. పరిశ్రమలు 33% గ్రీన్ బెల్ట్ రూల్ పాటించాలని స్పష్టంచేశారు.


