News October 14, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 14, సోమవారం
ఏకాదశి: ఉదయం.6.41 గంటలకు
ద్వాదశి: రాత్రి 3.41 గంటలకు
శతభిష: రాత్రి 12.42 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.24-10.52 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.16-1.03 గంటల వరకు,
మధ్యాహ్నం 2.37-3.24 గంటల వరకు
Similar News
News December 22, 2024
పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ
ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.
News December 22, 2024
ఇవి అత్యంత ఖరీదైన చీరలు
చీరలు స్త్రీల అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంటాయి. అందుకే భారత మహిళలు చీర కట్టును ఇష్టపడుతుంటారు. చీరల్లో లెక్కలేనన్ని రకాలున్నా వాటిలో అత్యంత ఖరీదైనవి మాత్రం కొన్నేే. అవి.. మూంగా పట్టుచీర: ధర రూ.2 లక్షల వరకు ఉంటుంది. పటాన్ పటోలా చీర: రూ.లక్ష వరకూ ఉంటుంది. కడ్వా కట్‌వర్క్ చీర: రూ.5 లక్షల వరకూ ధర ఉంటుంది. కాంచీపురం పట్టుచీర: ధర రూ.5 లక్షల వరకూ ఉంటుంది. బనారస్ పట్టుచీర: రూ.5 లక్షల వరకూ ఉంటుంది.
News December 22, 2024
FEB 28 వరకు పీసీ ఘోష్ కమిషన్ గడువు
TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అవకాశమిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో సమస్యలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.