News October 14, 2024

ఉజ్బెకిస్థాన్‌లో హుజురాబాద్ అధ్యాపకుడి ప్రసంగం

image

ఉజ్బెకిస్థాన్‌ దేశంలోని తాష్కెంట్ అల్ఫ్రాగానస్ యూనివర్సిటీలో శనివారం జరిగిన యునెస్కో ఆసియా పసిఫిక్ వ్యవస్థాపక విద్యాసదస్సులో హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.మల్లారెడ్డి భారతదేశం తరఫున పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దంలో యువత ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను అధిగమించే విద్యావిధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో 40 దేశాల నుంచి 200 ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News October 14, 2024

కరీంనగర్: ముమ్మరంగా రేషన్ కార్డుల సవరణ!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు రేషన్ కార్డులలో లోపాలను సవరిస్తున్నారు. అనర్హులను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరణించినవారు, వివాహమై అత్తింటికి వెళ్లిన మహిళలు తదితరులను తొలగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత 9 నెలల వ్యవధిలోనే 1,186 రేషన్ కార్డులను రద్దు చేసి 5,819 మంది లబ్ధిదారుల పేర్లు తొలగించారు.

News October 14, 2024

తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి: KNR కలెక్టర్

image

ప్రతినిత్యం తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, తద్వారా చేతుల అపరిశుభ్రత వల్ల వచ్చే అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు. అక్టోబర్ 15న ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘బ్యానర్’ను ఆమె ఆవిష్కరించారు. ‘ఆరోగ్య భద్రత’ అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.

News October 14, 2024

రాజన్న దర్శనానికి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం మంత్రి కొండ సురేఖ దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చారు. దీంతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఎస్పీ అఖిల్ మహాజన్‌లు, వేములవాడ ఆర్డీవో పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.