News October 14, 2024

టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై తాప్సీ ఆగ్రహం

image

టర్కిష్ ఎయిర్ లైన్స్‌పై హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యారు. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘విమానం 24 గంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికుల సమస్య కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇటీవల శృతి హాసన్ కూడా ఇండిగో సంస్థపై మండిపడిన సంగతి తెలిసిందే.

Similar News

News February 7, 2026

శుభ సమయం (07-2-2026) శనివారం

image

➤ తిథి: బహుళ షష్టి తె.3.47 వరకు ➤ నక్షత్రం: చిత్త రా.3.37 వరకు ➤ శుభ సమయాలు: ఉ.08.03-8.5 వరకు, ఉ.10.18-ఉ.10.28, మ.12.12-మ.1.08 వరకు తిరిగి మ.2.05-మ.3.01 వరకు తిరిగి సా.4.55-సా.5.51 వరకు ➤ రాహుకాలం: ఉ.09.00-ఉ.10.30 ➤ యమగండం: మ.1.30-మ.3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.06.03-ఉ.08.02 వరకు ➤ వర్జ్యం: ఉ.10.29-మ.12.12 వరకు ➤ అమృత ఘడియలు: రా.8.46-రా.10.28 వరకు

News February 7, 2026

క్యూఆర్ కోడ్‌తో భూవివరాలు సులభతరం: కలెక్టర్

image

పట్టాదారు పాసుపుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి, యజమాని వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కుర్నూతల గ్రామం వెంకట్ రాజు గారి పల్లెలో నిర్వహించిన పాసుపుస్తకాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పుస్తకాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.

News February 7, 2026

NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

image

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్‌తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్‌ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.