News October 14, 2024

ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, గెలిచిన వ్యక్తి సాయిబాబా: నారాయణ

image

TG: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రొ.సాయిబాబా పట్ల కేంద్ర వైఖరికి నిరసనగానే నిన్నటి ‘అలయ్ బలయ్‌’లో పాల్గొనలేదని CPI నేత నారాయణ అన్నారు. సాయిబాబా దివ్యాంగుడైనా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, రాజీలేని పోరాటం చేసి గెలిచారన్నారు. కానీ తన శరీరంతో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన పోరాటాలతో మనతోనే ఉన్నారని తెలిపారు.

Similar News

News January 28, 2026

కలుపు తీయనివాడు కోత కోయడు

image

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.

News January 28, 2026

అలాంటి పసుపుకే మంచి ధర: మార్కెటింగ్ శాఖ

image

TG: పసుపు పంట చేతికొస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు చేసింది. ఉడికించిన పసుపును 15 రోజులు ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డులకు తీసుకురావాలని తెలిపింది. తేమ శాతం 12%లోపు ఉంటే మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని పేర్కొంది. కాడి, గోల, చూర వంటి మలినాలు లేకుండా శుభ్రపరచిన పసుపును తేవాలని సూచించింది. NZB మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపింది.

News January 28, 2026

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. నేటి నుంచి FEB 13 వరకు తొలి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సెషన్ జరగనుంది. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో MGNREGA, SIR, UGC నిబంధనలు తదితర అంశాలపై చర్చలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.