News October 14, 2024

J&Kలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

image

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా J&K ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్-ఎన్సీ కూటమి నాయకుడిగా అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Similar News

News October 14, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

News October 14, 2024

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి

image

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి ప్రకటించారు. తన భార్య నిర్మలారెడ్డి లేదా తన అనుచరుడు ఆంజనేయులతో పోటీ చేయిస్తానని తెలిపారు. ‘దీనిపై CM రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్‌తో చర్చిస్తా. గత ఎన్నికల్లో BRS నేతలు ఓటుకు రూ.2వేలు ఇచ్చి నన్ను ఓడించారు. ఓడినా ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధికి నిధులు తెస్తా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

News October 14, 2024

పాకిస్థాన్ గెలవాలి.. భారత్ ఫ్యాన్స్

image

ఉమెన్స్ టీ20 WC సందర్భంగా భారత అభిమానులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ గెలవాలని కోరుకునే పరిస్థితి వచ్చింది. నిన్న ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో భారత మహిళా జట్టు సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇవాళ న్యూజిలాండ్‌పై పాక్ గెలిస్తేనే మనం సెమీస్ చేరుతాం. దీంతో ఇవాళ ఎలాగైనా పాక్ గెలవాలని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?